తెలుగులో 50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఫిబ్రవరి 2024
Current Affairs Bits 2024 February Telugu Current Affairs

తెలుగులో 50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఫిబ్రవరి 2024

50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాదానాలు ఫిబ్రవరి 2024. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. భారత సైన్యంలో సుబేదార్ ర్యాంక్‌ను పొందిన మొదటి మహిళ ఎవరు ?

  1. ప్రేరణా దియోస్తలీ
  2. అవని చతుర్వేది
  3. షాలిజా ధామి
  4. ప్రీతి రజక్
సమాధానం
4. ప్రీతి రజక్

2. దేశంలో మొట్టమొదటి ఖనిజ అన్వేషణ డ్రోన్ అభివృద్ధి చేసిన మారుత్ డ్రోన్స్ ఏ రాష్ట్రానికి చెందినది ?

  1. తమిళనాడు
  2. మహారాష్ట్ర
  3. తెలంగాణ
  4. గుజరాత్
సమాధానం
3. తెలంగాణ

3. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 టైటిల్ విజేత ఎవరు ?

  1. తమిళనాడు
  2. పంజాబ్
  3. మహారాష్ట్ర
  4. కర్ణాటక
సమాధానం
3. మహారాష్ట్ర

4. 2024లో భారతరత్న అందుకున్న వారిలో జీవించి ఉన్న ఏకైక గ్రహీత ఎవరు ?

  1. కర్పూరి ఠాకూర్
  2. పివి నరసింహారావు
  3. ఎంఎస్ స్వామినాధన్
  4. లాల్ కృష్ణ అద్వానీ
సమాధానం
4. లాల్ కృష్ణ అద్వానీ

5. పారిస్ ఒలింపిక్స్ 2024 టార్చ్ బేరర్‌గా ఎంపికైన భారత క్రీడాకారుడు ఎవరు ?

  1. సాక్షి మాలిక్
  2. నీరజ్ చోప్రా
  3. పివి సింధు
  4. అభినవ్ బింద్రా
సమాధానం
4. అభినవ్ బింద్రా

6. ఐఎన్ఎస్ సంధాయక్ ఏ నౌకాదళ కమాండ్ కింద సేవలు అందిస్తుంది ?

  1. సదరన్ నావల్ కమాండ్ (కోచి)
  2. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం)
  3. పశ్చిమ నౌకాదళ కమాండ్ (ముంబయి)
  4. దక్షిణ కమాండ్ (పూణే)
సమాధానం
2. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం)

7. ఇటీవలే విలువైన కోల్టన్ నిక్షేపాలను ఏ దేశంలో కనుగొన్నారు ?

  1. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
  2. బ్రెజిల్
  3. సుడాన్
  4. కెన్యా
సమాధానం
4. కెన్యా

8. సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళా ఏటా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?

  1. గుజరాత్
  2. పశ్చిమ బెంగాల్
  3. హర్యానా
  4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం
3. హర్యానా

9. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024కు ఆతిధ్యం ఇచ్చిన రాష్ట్రం/యూటీ ఏది ?

  1. లడఖ్
  2. జమ్మూ & కాశ్మీర్
  3. హిమాచల్ ప్రదేశ్
  4. లడఖ్ & జమ్మూ కాశ్మీర్
సమాధానం
4. లడఖ్ & జమ్మూ కాశ్మీర్

10. 878 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపిన రష్యన్ వ్యోమగామి ఎవరు ?

  1. ఒలేగ్ కోనోనెంకో
  2. గెన్నాడి పడల్కా
  3. పెగ్గీ విట్సన్
  4. రిచర్డ్ బ్రాన్సన్
సమాధానం
1. ఒలేగ్ కోనోనెంకో  

11. తమిళ నటుడు విజయ్ ఇటీవలే ప్రకటించిన రాజకీయ పార్టీ ఏది ?

  1. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం-
  2. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
  3. తమిళగ వెట్రి కజగం
  4. అంబేద్కర్ మక్కల్ ఇయక్కం-
సమాధానం
3. తమిళగ వెట్రి కజగం

12. ఇటీవలే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది ?

  1. తమిళనాడు
  2. ఉత్తరాఖండ్
  3. ఒడిశా
  4. కర్ణాటక
సమాధానం
2. ఉత్తరాఖండ్

13. కజకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?

  1. ఒల్జాస్ బెక్టెనోవ్‌
  2. కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్
  3. మహ్మద్ షియా అల్ సుడానీ
  4. ఆదిల్బెక్ జాక్సిబెకోవ్
సమాధానం
1. ఒల్జాస్ బెక్టెనోవ్‌

14. ఇటీవలే ఏ స్టేడియంకు నిరంజన్ షా క్రికెట్ స్టేడియంగా పేరు మార్పు చేశారు ?

  1. డిల్లీ కోట్ల స్టేడియం
  2. ఇండోర్ స్టేడియం
  3. ధర్మశాల స్టేడియం
  4. రాజ్‌కోట్‌ స్టేడియం
సమాధానం
4. రాజ్‌కోట్‌ స్టేడియం

15. ఇటీవలే విదేశాల్లోని విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. కర్ణాటక
  3. తెలంగాణ
  4. తమిళనాడు
సమాధానం
3. తెలంగాణ

16. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ప్రకారం అత్యంత రద్దీ గల భారతీయ సిటీ ?

  1. ఢిల్లీ
  2. పూణే
  3. చెన్నై
  4. బెంగుళూరు
సమాధానం
4. బెంగుళూరు

17. అకడమిక్ రంగం నుండి యూఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్న భారతీయ ప్రముఖుడు ?

  1. నేహా కక్కర్
  2. సోనూ సూద్
  3. సురేష్ కుమార్‌
  4. ఆనంద్ కుమార్‌
సమాధానం
4. ఆనంద్ కుమార్‌

18. కేంద్ర జల మంత్రిత్వ శాఖ నుండి వాటర్ వారియర్ సిటీగా గుర్తింపు పొందిన నగరం ?

  1. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
  2. నోయిడా (ఉత్తరప్రదేశ్)
  3. గాంధీనగర్ (గుజరాత్)
  4. రామేశ్వరం (తమిళనాడు)
సమాధానం
2. నోయిడా (ఉత్తరప్రదేశ్)

19. 7వ ఎడిషన్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ?

  1. విశాఖపట్నం (ఇండియా)
  2. కొలంబో (శ్రీలంక)
  3. పెర్త్‌ (ఆస్ట్రేలియా)
  4. లండన్ (యూకే)
సమాధానం
3. పెర్త్‌ (ఆస్ట్రేలియా)

20. బొండో పోర్జా & ఖోండ్ పోర్జా గిరిజన తెగలు ఏ రాష్ట్రం నుండి ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు?

  1. జమ్మూ & కాశ్మీర్
  2. ఒడిశా
  3. తెలంగాణ
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
4. ఆంధ్రప్రదేశ్

21. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌ ఏ రాష్ట్రం నుండి భారతరత్న అవార్డు అందుకున్నారు ?

  1. మహారాష్ట్ర
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఉత్తరప్రదేశ్
  4. పంజాబ్
సమాధానం
3. ఉత్తరప్రదేశ్

22. ఇటీవలే టెరోసార్ ఫ్లయింగ్ డైనోసార్ శిలాజంను ఏ దేశంలో కనుగొన్నారు ?

  1. స్కాట్లాండ్‌
  2. జాంబియా
  3. చైనా
  4. వియాత్నం
సమాధానం
1. స్కాట్లాండ్‌

23. ఇటీవలే ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి పసిఫిక్ నాయకుడు ఎవరు ?

  1. ఉహురు కెన్యాట్టా
  2. రాబర్ట్ ముగాబే
  3. నరేంద్ర మోడీ
  4. జేమ్స్ మరాపే
సమాధానం
4. జేమ్స్ మరాపే

24. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ఐఆర్ఎస్ అధికారి ఎవరు ?

  1. దీపక్ కుమార్ మీనా
  2. ధర్మేంద్ర కుమార్
  3. నరేంద్ర కుమార్ యాదవ్
  4. దినేష్ కుమార్
సమాధానం
3. నరేంద్ర కుమార్ యాదవ్

25. పాత పెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ?

  1. అస్సాం
  2. సిక్కిం
  3. మేఘాలయ
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
2. సిక్కిం

26. అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2024 విజేత ?

  1. శ్రీలంక
  2. ఇండియా
  3. పాకిస్తాన్
  4. ఆస్ట్రేలియా
సమాధానం
4. ఆస్ట్రేలియా

27. కెందు ఆకుల కార్మికులకు ఆర్థిక సహాయం ప్రకటించిన రాష్ట్రం ఏది ?

  1. బీహార్
  2. అస్సాం
  3. జమ్మూ & కాశ్మీర్
  4. ఒడిశా
సమాధానం
4. ఒడిశా 

28. ఇటీవలే హుక్కా పార్లర్లపై తక్షణ నిషేధం విధించిన రాష్ట్రం ?

  1. పంజాబ్
  2. తెలంగాణ
  3. కేరళ
  4. మహారాష్ట్ర
సమాధానం
2. తెలంగాణ 

29. ఎలక్టోరల్ బాండ్ల పథకంను కేంద్రం ఏ ఏడాది నోటిఫై చేసింది ?

  1. 2019
  2. 2023
  3. 2018
  4. 2024
సమాధానం
3. 2018

30. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ఎందుకు తీర్పు ఇచ్చింది ?

  1. రాజకీయ నిధుల సేకరణలో పారదర్శకత లోపించడం
  2. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) స్వేచ్ఛ ఉల్లంఘన
  3. వ్యాపార, రాజకీయ నాయకుల మధ్య క్విడ్ ప్రోకో ఒప్పందాలు
  4. పైవి అన్నియూ
సమాధానం
4. పైవి అన్నియూ

31. ఐఆర్‌సిటిసి నూతన సీఎండీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?

  1. మామిడాల జగదీష్ కుమార్
  2. గౌరవ్ ద్వివేది
  3. సంజయ్ కుమార్ జైన్
  4. ప్రవీణ్ కుమార్ పుర్వార్
సమాధానం
3. సంజయ్ కుమార్ జైన్

32. ఇస్రో ఇన్సాట్-3డిఎస్‌ ఉపగ్రహం ఏ  పరిశోధన కోసం ప్రయోగించబడింది ?

  1. వాతావరణ పర్యవేక్షణ
  2. విపత్తు హెచ్చరికల నిర్వహణ
  3. గనుల అన్వేషణ
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 & 2 సరైనవి

33. గురుముఖి లిపి ఏ భారతీయ భాషకు సంబంధించింది ?

  1. పంజాబీ
  2. తెలుగు
  3. హిందీ
  4. మరాఠీ
సమాధానం
1. పంజాబీ

34. మిలాన్ నావల్ డ్రిల్ 12వ ఎడిషన్‌కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. అండమాన్ మరియు నికోబార్
  2. మాల్దీవులు
  3. లక్షదీప్
  4. విశాఖపట్నం
సమాధానం
4. విశాఖపట్నం

35. కింది వాటిలో ఏ నాలుగు దేశాలను క్వాడ్ కూటమి అంటారు ?

  1. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, ఇరాక్
  2. ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, జపాన్
  3. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యూఎస్
  4. రష్యా, చైనా, జపాన్, ఇండియా
సమాధానం
3. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యూఎస్

36. టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసిన రెండో భారతీయ క్రీడాకారుడు ఎవరు ?

  1. హర్భజన్ సింగ్
  2. ఇషాంత్ శర్మ
  3. అనిల్ కుంబ్లే
  4. రవిచంద్రన్ అశ్విన్
సమాధానం
4. రవిచంద్రన్ అశ్విన్

37. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ?

  1. ఐఈఏ 1974 లో స్థాపించబడింది
  2. ఐఈఏ 31 దేశాల ప్రభుత్వాంతర సంస్థ
  3. ఐఈఏ ప్రపంచ ఇంధన రంగంపై విధాన సిఫార్సులు చేస్తుంది
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4.పైవి అన్ని సరైనవి

38. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 లో భారత్ ర్యాంకు ఎంత ?

  1. 74వ ర్యాంకు
  2. 85వ ర్యాంకు
  3. 61వ ర్యాంకు
  4. 58వ ర్యాంకు
సమాధానం
2. 85వ ర్యాంకు

39. భారత్ పౌరులు ప్రస్తుతం ఎన్ని దేశాలకు వీసారహిత ప్రయాణం చేయగలరు ?

  1. 85 దేశాలు
  2. 54 దేశాలు
  3. 62 దేశాలు
  4. 34 దేశాలు
సమాధానం
3. 62 దేశాలు

40. జపాన్ ప్రయోగించనున్న మొదటి వుడ్ శాటిలైట్ పేరు ఏంటి ?

  1. అడియోస్ శాట్
  2. అరేస్ శాట్
  3. ఓషుమి శాట్
  4. లిగ్నో శాట్
సమాధానం
4. లిగ్నో శాట్

41. 58వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు ?

  1. దామోదర్ మౌజో
  2. నీలమణి ఫూకాన్
  3. గుల్జార్ & రామభద్రాచార్య
  4. కేదార్‌నాథ్ సింగ్
సమాధానం
3. గుల్జార్ & రామభద్రాచార్య

42. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కొత్త అధ్యక్షుడు ఎవరు ?

  1. డెన్నిస్ ఫ్రాన్సిస్
  2. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్
  3. నవాఫ్ సలామ్
  4. ఉర్సులా వాన్ డెర్ లేయెన్
సమాధానం
3. నవాఫ్ సలామ్

43. ఎఎన్ఐ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం ఎవరు ?

  1. యోగి ఆదిత్యనాథ్
  2. అరవింద్ కేజ్రీవాల్
  3. మమతా బెనర్జీ
  4. నవీన్ పట్నాయక్
సమాధానం
4. నవీన్ పట్నాయక్

44. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన మొదటి ఆర్థడాక్స్ క్రైస్తవ దేశం ఏది ?

  1. బల్గేరియా
  2. సెర్బియా
  3. గ్రీస్
  4. రొమేనియా
సమాధానం
3.గ్రీస్

45. ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్ ప్రకారం అత్యధిక ప్రజాస్వామ్య దేశం ఏది ?

  1. ఫిన్లాండ్
  2. నార్వే
  3. డెన్మార్క్
  4. న్యూజిలాండ్
సమాధానం
2. నార్వే

46. శాంతి ప్రయాస్ IV వ్యాయామం ఏ దేశంలో నిర్వహించబడింది ?

  1. ఇండియా
  2. టిబెట్
  3. భూటాన్
  4. నేపాల్
సమాధానం
4. నేపాల్

47. మేడారం జాతర ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది ?

  1. యాదాద్రి భువనగిరి
  2. జయశంకర్ భూపాలపల్లి
  3. జోగులాంబ గద్వాల్
  4. ములుగు జిల్లా
సమాధానం
4. ములుగు జిల్లా  

48. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద హైవే నెట్‌వర్క్ కలిగిన ఉన్న దేశం ?

  1. బ్రెజిల్
  2. రష్యా
  3. ఇండియా
  4. చైనా
సమాధానం
3. ఇండియా

49. ఐఎల్ఒ కన్వెన్షన్‌ను ఆమోదించిన మొదటి ఆసియా దేశం ఏది ?

  1. ఇండియా
  2. చైనా
  3. ఇండోనేషియా
  4. ఫిలిప్పీన్స్
సమాధానం
4. ఫిలిప్పీన్స్

50. లోక్‌పాల్ నూతన చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు ?

  1. డివై చంద్రచూడ్
  2. దీపక్ మిశ్రా
  3. అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్
  4. రంజన్ గొగోయ్
సమాధానం
3. అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్

Post Comment