April 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023 Telugu Current Affairs

April 2023 Current Affairs Questions In Telugu

తెలుగులో కరెంట్ అఫైర్స్ క్విజ్ ఏప్రిల్ 2023 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాధానాలను సాధన చేయండి. ఏప్రిల్ 2023 నెలలో చోటుచేసుకున్న సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. రాజస్థాన్
  3. మహారాష్ట్ర
  4. మధ్యప్రదేశ్
సమాధానం
3. మహారాష్ట్ర

2. క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం కింది వాటిలో దేనికి సంబంధించినది ?

  1. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం
  2. స్వయం సహాయక గ్రూపులకు ఉపాధి కల్పించడం
  3. జాతీయ ఉత్తమ పంచాయతీలలో ఉపాధి అవకాశాల కల్పన
  4. ప్రైవేట్ కంపెనీలలో స్థానిక యువతకు 50 శాతం రిజర్వేషన్లు
సమాధానం
1. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం  

3. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం ఎగుమతుల విలువ ?

  1. 950 బిలియన్ డాలర్లు
  2. 500 బిలియన్ డాలర్లు
  3. 450 బిలియన్ డాలర్లు
  4. 750 బిలియన్ డాలర్లు
సమాధానం
4. 750 బిలియన్ డాలర్లు  

4. కింది వాటిలో నాగాల మతపరమైన లేదా సామాజిక ఆచారాలు కాపాడే ఆర్టికల్ ఏది ?

  1. ఆర్టికల్ 371-F
  2. ఆర్టికల్ 371-A
  3. ఆర్టికల్ 371-B
  4. ఆర్టికల్ 371-C
సమాధానం
2. ఆర్టికల్ 371-A  

5. ఆర్టన్ క్యాపిటల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 లో ఇండియా ర్యాంకు ?

  1. 65వ స్థానం
  2. 85వ స్థానం
  3. 98వ స్థానం
  4. 144వ స్థానం
సమాధానం
4. 144వ స్థానం  

6. ఇటీవలే షాంఘై సహకార సంస్థ డైలాగ్ భాగస్వామిగా చేరిన దేశం ఏది ?

  1. ఈజిప్ట్
  2. ఖతార్
  3. సౌదీ అరేబియా
  4. పైవి అన్నియూ
సమాధానం
4. పైవి అన్నియూ 

7. ఇటీవలే సవరించిన కాంపిటీషన్ యాక్ట్ 2002 కి సరైన వివరణ ?

  1. ఇది భారతదేశంలో వాణిజ్య పోటీని నియంత్రిస్తుంది.
  2. దీనిని పూర్వపు గుత్తాధిపత్యం & నిర్బంధ వాణిజ్య చట్టం స్థానంలో తీసుకొచ్చారు.
  3. మోస పూర్వక సంస్థల ప్రపంచ టర్నోవర్‌లపై జరిమాన విధిస్తుంది.
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

8. ఇటీవలే సరస్సుల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. కేరళ
  2. ఒడిశా
  3. గుజరాత్
  4. తెలంగాణ
సమాధానం
4. తెలంగాణ 

9. ఇటీవలే యూరోపియన్ జీఐ ట్యాగ్ పొందిన భారతీయ ఉత్త్పత్తి ఏది ?

  1. బసోలి పెయింటింగ్ (జమ్మూ కాశ్మీర్‌)
  2. కాంగ్రా టీ (హిమాచల్ ప్రదేశ్)
  3. బీహార్‌ మిర్చా రైస్‌ (బీహార్)
  4. లాంగ్డా మామిడి (ఉత్తర ప్రదేశ్)
సమాధానం
2. కాంగ్రా టీ (హిమాచల్ ప్రదేశ్) 

10. 100 శాతం రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరణ పూర్తిచేసిన తోలి రాష్ట్రం ఏది ?

  1. బీహార్
  2. హర్యానా
  3. తమిళనాడు
  4. మహారాష్ట్ర
సమాధానం
2. హర్యానా

11. సుఖోయ్-30ఎంకేఐలో ప్రయాణించిన తోలి భారత రాష్ట్రపతి ఎవరు ?

  1. ప్రతిభా పాటిల్
  2. ఏపీజే అబ్దుల్ కలాం
  3. ద్రౌపది ముర్ము
  4. కేఆర్ నారాయణ్
సమాధానం
2. ఏపీజే అబ్దుల్ కలాం

12. ప్రస్తుతం ప్రారంభించబడిన వందే భారత్ మార్గాల్లో అతి పొడవైన రూట్ ఏది ?

  1. సికింద్రాబాద్ - తిరుపతి
  2. హౌరా - న్యూ జల్పైగురి
  3. న్యూఢిల్లీ - వారణాసి
  4. రాణి కమలాపతి - ఢిల్లీ
సమాధానం
3. న్యూఢిల్లీ - వారణాసి

13. వాయు కాలుష్యా పర్యవేక్షణ కోసం టెంపో అనే పరికరాన్ని ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఏది ?

  1. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
  2. ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ
  3. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
  4. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
సమాధానం
3. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్  

14. అంతర్జాతీయ యోగా మహోత్సవ్‌ 2023కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. ఇటానగర్
  2. డిబ్రూఘర్
  3. వారణాసి
  4. హైదరాబాద్
సమాధానం
2. డిబ్రూఘర్  

15. ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఈశాన్య రాష్ట్రం ఏది ?

  1. అరుణాచల్ ప్రదేశ్
  2. త్రిపుర
  3. అస్సాం
  4. నాగాలాండ్
సమాధానం
2. త్రిపుర 

16. ఇటీవలే యాంటీ డోపింగ్ వ్యవహారంలో నిషేదానికి గురైన భారత వెయిట్‌లిఫ్టర్ ఎవరు ?

  1. పూనం యాదవ్
  2. మీరాబాయి చాను
  3. జెరెమీ లాల్రిన్నుంగా
  4. సంజితా చాను
సమాధానం
4. సంజితా చాను

17. పురుషుల టీ20 క్రికెట్టులొ తొలి మహిళా ఆన్-ఫీల్డ్ అంపైర్‌ ఎవరు ?

  1. క్లైర్ పోలోసాక్ (ఆస్ట్రేలియా)
  2. పొలోసాక్ (ఆస్ట్రేలియా)
  3. బృందా ఘనశ్యామ్ రాఠి (ఇండియా)
  4. కిమ్ కాటన్ (న్యూజిలాండ్‌)
సమాధానం
4. కిమ్ కాటన్ (న్యూజిలాండ్‌)  

18. నాటోలో సభ్యత్వం కలిగిన నాన్ యూరోపియన్ దేశం ఏది ?

  1. అమెరికా
  2. రష్యా
  3. కెనడా
  4. ఆప్షన్ 1 మరియు 3 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 మరియు 3 సరైనవి  

19. లూనాచారి దుస్తులలో కిలిమంజారోను అధిరోహించిన అంజలి శర్మ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?

  1. ఉత్తరప్రదేశ్
  2. ఉత్తరాఖండ్
  3. హిమాచల్ ప్రదేశ్
  4. జమ్మూ & కాశ్మీర్
సమాధానం
3. హిమాచల్ ప్రదేశ్ 

20. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌ నుండి ఉపశమనం కోసం 'కూల్ రూఫ్' పాలసీ ప్రారంభించిన రాష్ట్రం ?

  1. తెలంగాణ
  2. గుజరాత్
  3. ఒడిశా
  4. మహారాష్ట్ర
సమాధానం
1. తెలంగాణ 

21. భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రి ఎవరు ?

  1. మమతా బెనర్జీ
  2. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  3. పెమా ఖండూ
  4. నితీష్ కుమార్
సమాధానం
2. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  

22. ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏ నగరంలో ఆవిష్కరించబడింది ?

  1. గాంధీనగర్
  2. భూపాల్
  3. అమరావతి
  4. హైదరాబాద్
సమాధానం
4. హైదరాబాద్ 

23. ఇటీవలే ఘనా ఆమోదించిన ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ బ్రాండ్ పేరు ఏంటి ?

  1. ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ R21
  2. ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ R22
  3. ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ M21
  4. ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ M22
సమాధానం
1.ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ R21

24. కింది వాటిలో రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లలో ప్రయాణించే భారతీయ రైళ్లు ఏవి ?

  1. వందే భారత్ ఎక్సప్రెస్
  2. దురంతో ఎక్స్‌ప్రెస్
  3. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  4. రాపిడ్‌ఎక్స్
సమాధానం
4. రాపిడ్‌ఎక్స్  

25. ఇటీవలే జాతీయ హోదాను కోల్పోయిన రాజకీయ పార్టీ ఏది ?

  1. ఆమ్ ఆద్మీ పార్టీ
  2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (సీపీఎం)
  3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)
  4. నేషనల్ పీపుల్స్ పార్టీ
సమాధానం
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)  

26. తాజా టైగర్ సెన్సస్ డేటా ప్రకారం భారతదేశంలో పులుల జనాభా ఎంత ?

  1. 3,000 పులులు
  2. 3,167 పులులు
  3. 2,450 పులులు
  4. 1,450 పులులు
సమాధానం
2. 3,167 పులులు 

27. ఇటీవలే కింది ఏ భాషలో భారత రాజ్యాంగం యొక్క న్యూ వెర్షన్ విడుదల చేశారు ?

  1. బోడో భాష
  2. సంతాలి భాష
  3. డోగ్రీ భాష
  4. మైథిలి భాష
సమాధానం
3. డోగ్రి భాష 

28. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్‌ని ప్రారంభించిన దేశం ఏది ?

  1. ఇండోనేషియా
  2. ఉత్తర కొరియా
  3. చైనా
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా

29. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌ విభాగంలో అవార్డు అందుకున్న తెలంగాణ పంచాయతీ ఏది ?

  1. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట
  2. రంగారెడ్డి జిల్లాలోని కన్హా
  3. భద్రాద్రి కొత్తగూడెంలోని గౌతంపూర్
  4. పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్‌పూర్
సమాధానం
2. రంగారెడ్డి జిల్లాలోని కన్హా  

30. సుడాన్‌ నుండి భారత పౌరుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటి  ?

  1. ఆపరేషన్ దోస్త్
  2. ఆపరేషన్ గంగా
  3. ఆపరేషన్ కావేరి
  4. ఆపరేషన్ మైత్రి
సమాధానం
3. ఆపరేషన్ కావేరి 

Post Comment