విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ కాలేజీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ విద్యా సహాయాన్ని సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ లేదా వారికీ సంబంధించిన దాతల సహాయంతో అందిస్తారు.
స్కాలర్షిప్ పేరు | విద్యాధాన్ స్కాలర్షిప్ 2023 |
స్కాలర్షిప్ టైప్ | పేద విద్యార్థులకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ |
ఎవరికి అందిస్తారు | ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు |
అర్హుత | టెన్త్ పాస్ |
విద్యాధాన్ స్కాలర్షిప్ ఆంధ్ర ప్రదేశ్ - షెడ్యూల్ 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ | NA |
దరఖాస్తు తుది గడువు | NA |
స్క్రీనింగ్ టెస్ట్ | NA |
ఇంటర్వ్యూ / టెస్ట్ | NA |
విద్యాధాన్ స్కాలర్షిప్ తెలంగాణ - షెడ్యూల్ 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ | NA |
దరఖాస్తు తుది గడువు | NA |
స్క్రీనింగ్ టెస్ట్ | NA |
ఇంటర్వ్యూ / టెస్ట్ | NA |
విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 4,300 మంది విద్యార్థులకు అందిస్తున్నారు.
ఈ పథకం పది ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే విద్యార్థులకు రెండేళ్ల నిడివితో అందిస్తారు. విద్యార్థి ఇంటర్మీడియేట్'లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, డిగ్రీ కోర్సులకు కూడా సహాయం అవసరమయితే అందిస్తారు. ఈ ప్రోగ్రాం పరిధిలో ఒక్కో విద్యార్థికి ఏడాదికి గరిష్టంగా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.
విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఎలిజిబిలిటీ
- 10వ తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- కాలేజీ విద్యకు నోచుకోని ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అర్హులు.
- విద్యాధాన్ స్కాలర్షిప్ అర్హుత సాధించిన విద్యార్థులు ఫౌండేషన్ నిర్వహించే వివిధ కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉంటుంది.
- విద్యార్థి పదిలో 90 శాతం (9 CGPA) మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- విద్యార్థి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు.
విద్యాధాన్ స్కాలర్షిప్ దరఖాస్తు విధానం
అర్హులైన విద్యార్థులు, మీ సొంత ఇమెయిల్ ఐడీతో మొదటగా విద్యాధాన్ పోర్టల్ యందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ ఏర్పాటుచేసుకున్నాక అక్కడ కనిపించే అప్లై బటన్ పై క్లిక్ చేయడం ద్వారా స్కాలర్షిప్ దరఖాస్తు ఓపెన్ అవుతుంది. తర్వాత దశలో దరఖాస్తులో అడిగే పూర్తి వివరాలు, వాటికీ సంబంధించిన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.
మీ దరఖాస్తుకు సంభందించి వివరాలన్నీ పరిశీలించాక, మీరు అర్హులు అని భావిస్తే స్క్రీనింగ్ టెస్ట్ కాల్ లెటర్ లేదా ఇంటర్వ్యూ లెటర్ పంపిస్తారు. అందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేస్తారు. ఈ స్కాలర్షిప్ నోటిఫికేషన్ ఏటా టెన్త్ రిజల్ట్స్ తర్వాత విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : vidyadhan.andhra@sdfoundationindia.com or call K. Suresh, Phone: 8367751309.