టీఎస్ స్టడీ సర్కిల్ 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
Scholarships

టీఎస్ స్టడీ సర్కిల్ 2023 : పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, డీఎస్సీ వంటి ఎన్నో ఉద్యోగ పోటీ పరీక్షలకు పూర్తి ఉచితంగా రెసిడెన్సియల్ టైపు శిక్షణ అందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఏపీ స్టడీ సర్కిల్ పేరుతో కేవలం యూపీఏసీ పరీక్షలకు సంబంధించి మాత్రమే శిక్షణ అందించే ఈ ప్రోగ్రామ్, ప్రస్తుతం తెలంగాణ స్టడీ సర్కిల్ పేరిట దాదాపు అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుంది.

తెలంగాణ స్టడీ సర్కిల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ యందు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పది డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్స్ సహాయంతో సేవలు అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన ఒప్పందాలు ప్రకారం తెలంగాణ స్టడీ సర్కిల్ ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులకు సేవలు అందిస్తుంది.

స్కాలర్షిప్ తెలంగాణ స్టడీ సర్కిల్
స్కాలర్షిప్ టైప్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు
అర్హుత రెండు లక్షలలోపు కుటుంబ ఆదాయం

టీఎస్ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందే విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటుగా ఉచిత వసతి కూడా కల్పిస్తుంది. అంతే లేకుండా సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రతినెల 2,250/- రూపాయల వరకు స్టైపెండ్ అందిస్తుంది.

వీటికి అదనంగా ఎన్‌సిఈఆర్‌టి స్టాండర్డ్ మెటీరియల్స్, పర్సనల్ అలోవెన్సు కింద పురుషులకు 750/-, మహిళకు 1000/- లతో పాటుగా 200 వరకు మెడికల్ అలోవెన్సు కుండా అందిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు సరిపోయేలా గరిష్టంగా 10 నెలలు కోచింగ్ అందిస్తారు.

టీఎస్ స్టడీ సర్కిల్ ఎలిజిబిలిటీ

  1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత.
  2. వయస్సు 21 నుండి 35 ఏళ్ళ మధ్య ఉండాలి.
  3. కుటుంబ ఆదాయం రెండు లక్షలలోపు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

టీఎస్ స్టడీ సర్కిల్ దరఖాస్తు

తెలంగాణ స్టడీ సర్కిల్ వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్ అనుసారం అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ మీకు స్థానిక వార్త పత్రికల్లో మరియు న్యూస్ ఛానెళ్లలో ప్రచురిస్తారు.

నియామక నోటిఫికేషన్ అనుసారం టీఎస్ స్టడీ సర్కిల్ పోర్టల్ ద్వారా సంబంధిత పోటీపరీక్ష శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సంఖ్యను బట్టి, అర్హుత పరీక్షా లేదా అభ్యర్థి అకాడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులను గుర్తించి ఉచిత శిక్షణ మరియు వసతి అందిస్తారు.

Telangana study circle
Road No - 14, Banjara Hills,
opposite KBR Park,
Hyderabad, Telangana 500034
phone : 040 6410 4271

Post Comment