ఉన్నత విద్య కోసం చైనాకు ఛలో
అతి పురాతన ఆర్కిటెక్చర్ తో మోడరన్ డెవలప్మెంట్ సాధించిన చైనాకు గత కొన్నేళ్లుగా ఉన్నత విద్యకోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. గత రెండేళ్లో 5 నుండి 6 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్య కోసం చైనాలో అడుగుపెట్టారు. ఇదే సమయంలో, ఆశ్చర్యంగా చైనా నుండి యూఎస్, యూకే లకు వెళ్లే విద్యార్థుల సంఖ్యా దీనికంటే ఎక్కువ ఉండటం గమనార్హం. భారత్ నుండి ఏటా 20 నుండి 30 వేల మంది విద్యార్థులు చైనాకు వెళ్తున్నారు. ఇందులో మెడిసిన్ చేసేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్యా గణనీయంగా వుంది. దీనికి గల ప్రధాన కారణం ఇండియాలో కంటే చైనాలో తక్కువ ఖర్చుతో మెడిసిన్ పూర్తిచేసే అవకాశం ఉండటం.
యూఎస్ తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా ఉత్పాదిక రంగంలో ప్రపంచ దేశాలు పోటీపడలేని స్థానంలో అగ్రగామిగా కొనసాగుతుంది. బీజింగ్, షాంఘై, హాంకాంగ్, గ్వాంగ్జౌ, తైపీ వంటి చైనా వాణిజ్యా నగరాలు అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇవి ఇలా ఉంటె చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయి అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగివుంది. దాదాపు 2 వేలకు పైగా యూనివర్సిటీలు విద్యార్థులకు అత్యుత్తమ ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ప్రపంచ టాప్ 100 యూనివర్శిటీలలో 12 కి పైగా యూనివర్సిటీలు చైనాకి చెందినవై ఉన్నాయి. వీటన్నింటికి మించి గత దశాబ్ద కాలంగా చైనా మానవ వనురుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రాబోయే కాలంలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉండనుంది. అక్కడ స్థిరపడే ఆలోచన ఉన్నవారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు.
స్టడీ ప్రోగ్రాం ఎంపిక
విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తున్నాము అంటే, దానికి సంబంధించి బలమైన కారణం ఉండాలి. అందులో ప్రధానమైనది మీరు ఎంపిక చేసుకునే స్టడీ ప్రోగ్రాం. మెజారిటీ విదేశీ యూనివర్సిటీలు స్పెషలైజ్డ్ కోర్సులను ఎంపిక చేసుకునే విద్యార్థులకు మాత్రమే త్వరితగతిన అడ్మిషన్లు కల్పిస్తాయి. ఈ కోర్సు కోసం ఇంత దూరం వస్తున్నాడా అనే కోర్సులకు అడ్మిషన్లు కల్పించావు. వీసా జారీచేసే అధికారులు కూడా దీని కోసమే ఎక్కువ వాకాబు చేస్తారు. ఇదంతా ఉన్నత విద్య పేరుతో, విహారానికి వచ్చే విద్యార్థులను జల్లెడపట్టే ప్రక్రియలో భాగం. కావున మీరు ఎంపిక చేసుకునే కోర్సు. దానికి చెందిన భవిష్యత్ ప్రణాళిక పై మీకు స్ఫష్టమైన అవగాహనా ఉండాలి.
చైనా యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండే అన్ని రకాల పాపులర్ కోర్సులను అందిస్తున్నాయి. అందులో ఎక్కువ విదేశీ విద్యార్థులను ఆకర్షించే కోర్సుల జాబితాలో కంప్యూటర్ ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, నర్సింగ్, సాంప్రదాయ చైనీస్ మెడిసిన్, ఫార్మసీ. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, ఆర్కిటెక్చర్, మానేజ్మెంట్ కోర్సులు సంబంధించి బ్యాచిలర్, మాస్టర్స్, డాక్టరేట్ కోర్సులు ఉన్నాయి.
యూనివర్సిటీ అడ్మిషన్ దరఖాస్తు ప్రక్రియ
చైనా యూనివర్సిటీలు అందించే బ్యాచిలర్, మాస్టర్, డాక్టరేట్ డిగ్రీలు నిడివి ఎంపిక చేసుకునే సబ్జెక్టు అనుచరించి కనిష్టంగా 2 ఏళ్ళ నుండి గరిష్టంగా 5 ఏళ్ళ వరకు ఉంటాయి. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే ముందు చైనా యూనివర్సిటీల గురించి పూర్తిస్థాయి అధ్యయనం జరపండి. కోర్సు ఎంపిక యెంత ముఖ్యమో..ఆ కోర్సు అందించే యూనివర్సిటీ కూడా అంతే ముఖ్యం. యూనివర్సిటీ ఎంపిక జరిగాక, సంబంధిత ధ్రువపత్రాలతో యూనివర్శిటీకి దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి అందించే అన్ని వివరాలు పరిశీలన జరిగాక, యూనివర్సిటీ నుండి విద్యార్థికి నేరుగా అడ్మిషన్ లెటర్ అందుతుంది. కొన్ని యూనివర్సిటీలు కొంత ట్యూషన్ ఫీజు చెల్లించక అడ్మిషన్ ఆమోదిస్తాయి. చైనా స్టూడెంట్ వీసా పొందేందుకు ఈ అడ్మిషన్ లెటర్ తప్పనిసరి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి
యూనివర్సిటీల నుండి Letter of acceptance పొందాలంటే విద్యార్థి IELTS (International English Language Testing System), TOEFL (Test of English as a Foreign Language), PTE (Pearson Test of English) వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెజారిటీ చైనా యూనివర్సిటీలు IELTS స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. 6 to 7.5 మధ్య IELTS స్కోరు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కొన్ని కోర్సులకు, మరికొన్ని యూనివర్సిటీలకు చైనీస్ లాంగ్వేజ్ ప్రోఫిసెన్సీ (HSK) స్కోరు తప్పనిసరి.
Apply for a Study Visa
యూనివర్శిటీ నుండి Letter of acceptance (అడ్మిషన్ లెటర్) అందిన వెంటనే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలతో చైనా ఇమ్మిగ్రేషన్ పోర్టల్ లేదా దగ్గరలో ఉండే వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు ఇమిగ్రేషన్ పోర్టల్ యందు రిజిస్టర్ అవ్వాలి. దరఖాస్తు అందిన తర్వాత బయోమెట్రిక్ మరియు ఇమిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కబురు చేస్తారు. ఇదే సందర్భలో వీసా అధికారి దరఖాస్తు పరిశీలన చేస్తారు. దరఖాస్తులో ఉండే అంశాలు, విద్యార్థి చెప్పే సమాదానాలు ద్వారా వీసా అధికారి సంతృప్తి పొందితే 3 నుండి 4 వారాలలో స్టడీ పర్మిట్ జారీచేస్తారు.
ఉన్నత విద్యకోసం చైనాకు వచ్చే విద్యార్థుల కోసం నాలుగు రకాల వీసాలను జారీచేస్తుంది. లాంగ్ టర్మ్ కోర్సులలో చేరే విద్యార్థులు X1 రకానికి చెందిన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. 180 రోజులు లోపు కోర్సులకు వెళ్లే విద్యార్థులు X2 రకానికి చెందిన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలానే షార్ట్ టర్మ్ స్టడీ ఎక్స్చేంజి ప్రోగ్రామ్స్ కోసం వెళ్లే విద్యార్థులు F రకం వీసా, సమ్మర్, వింటర్ క్యాంపులకు వెళ్లే విద్యార్థులు L రకానికి చెందిన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Type Of Student Visa | Purpose of Visa | Cost Of Visa |
X1 VISA | Long-term study (more than 180 days) | 3900/- (Single Entry) |
X1 VISA | Short-term study (no more than 180 days) | 3900/- (Single Entry) |
F VISA | Exchange, visit, study and other activities | 3900/- (Single Entry) |
L VISA | Participating in summer / winter camps | 3900/- (Single Entry) |
స్టడీ పర్మిట్ ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్
- ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి Acceptance Letter.
- కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
- ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
- ఫీజికల్ ఎగ్జామినేషన్ రికార్డు.
- ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
- 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
- నేర చరిత్ర లేనట్లు police certificates.
విద్యార్థులకు ఉపయోగపడే వెబ్‌సైట్లు
- Study In China
- Visa application center
- Scholarships
- Chines Eembassy
- indian Eembassy in china
- International Education Info
5 Most recognized schools in China
- Tsinghua University
- Peking University
- Shanghai Jiao Tong University
- Fudan University
- Zhejiang University
Cost of study in China
యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోల్చుకుంటే చైనా స్టడీ బడ్జెట్ 60% నుండి 70% తక్కువ ఉంటుంది. కెనడాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను 1.5 లక్షల నుండి 2.5 లక్షల వరకు, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ 2 లక్షల నుండి 3 లక్షల లోపు పూర్తిచేయొచ్చు. వీసా చార్జీలు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే చాల తక్కువ, అలానే నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ కూడా 10,000 నుండి 15,000 రూపాయల మధ్యలోనే వుంటుంది. సాధారణ ఇండియన్ ఇనిస్టిట్యూట్ పెట్టె ఖర్చుతో చైనాలో ఉన్నత విద్య పూర్తిచేయొచ్చు.
విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే చైనా ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.
Study program | Average annual fee |
Undergraduate program | Rs 1.5 నుండి 2.5 లక్షలు |
Postgraduate master's degree | Rs 2 నుండి 3 లక్షలు |
Doctoral degree | Rs 2.5 నుండి 3.5 లక్షలు |
MBBS | Rs 5 నుండి 10 లక్షలు |
Living expenses | Average Budget |
Accommodation | Rs 2000 /- Pm |
Living costs | Up to Rs 15,000 /- Pm |
visa and permit | Rs 4,000/- |
Health & insurance | 1000/- |