September 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023

September 2023 Current Affairs Questions In Telugu

తెలుగులో కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ సెప్టెంబర్ 2023 సాధన చేయండి. సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. కక్రాపర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. తమిళనాడు.
  2. ఆంధ్రప్రదేశ్
  3. గుజరాత్
  4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం
3. గుజరాత్

2. ఆధార్-లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ?

  1. అస్సాం
  2. మణిపూర్
  3. నాగాలాండ్
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
3. నాగాలాండ్

3. ఇటీవలే భారత్ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మైత్రి క్యూబ్‌ అనేది ఏంటి ?

  1. వాక్సినేషన్ డ్రోన్
  2. పోర్టబుల్ హాస్పిటల్
  3. పోర్టబుల్ అంబులెన్సు
  4. ఎయిర్ అంబులెన్సు
సమాధానం
2. పోర్టబుల్ హాస్పిటల్

4. ఇస్రో యొక్క ఆదిత్య ఎల్1 ప్రయోగం ఏ తేదీన నిర్వహించబడింది ?

  1. ఆగష్టు 15
  2. ఆగష్టు 31
  3. సెప్టెంబర్ 2
  4. సెప్టెంబర్ 5
సమాధానం
3. సెప్టెంబర్ 2

5. ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్‌ 2023 ఏ నగరంలో జరిగింది?

  1. బెంగుళూరు
  2. వారణాసి
  3. గాంధీనగర్
  4. సిమ్లా
సమాధానం
3. గాంధీనగర్

6. 18వ తూర్పు ఆసియా సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది ?

  1. ఇండోనేషియా (జకార్తా)
  2. బంగ్లాదేశ్ (ఢాకా)
  3. ఇండియా (న్యూఢిల్లీ)
  4. యూఏఈ (అబుదాబి)
సమాధానం
1. ఇండోనేషియా (జకార్తా) 

7. యూజీసీ మాలవీయ మిషన్‌ సంబంధించి సరైన వాక్యం గుర్తించండి ?

  1. లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌
  2. యూనివర్సిటీ లైబ్రరీ ప్రోగ్రాం
  3. స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
  4. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌
సమాధానం
4. టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌

8. హాంగ్‌జౌ ఆసియా క్రీడలు 2022కు ప్రధాన స్పాన్సర్ ఎవరు ?

  1. మహీంద్రా
  2. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
  3. వయాకామ్ 18
  4. అమూల్
సమాధానం
4. అమూల్

9. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నుండి ఇటీవలే జిఐ ట్యాగ్‌ పొందిన ఉత్పత్తి ఏది ?

  1. కోట్‌ప్యాడ్ చేనేత వస్త్రం
  2. కాలా జీరా రైస్
  3. పిప్లి అప్లిక్ వర్క్
  4. బెర్హంపూర్ పట్టా
సమాధానం
2. కాలా జీరా రైస్

10. ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమ ప్రయోజనాలను అందించిన మొదటి రాష్ట్రం ఏది ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తమిళనాడు
  3. జార్ఖండ్
  4. ఒడిశా
సమాధానం
4. ఒడిశా 

11. ప్రస్తుతం జీ20 త్రయంగా (G20 త్రయోకా) వ్యవహరిస్తున్న దేశాలు ఏవి ?

  1. యూఎస్ఎ, ఇండియా, చైనా
  2. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా
  3. ఇండోనేషియా, ఇండియా, బ్రెజిల్
  4. ఇండియా, యూఎస్ఎ, కెనడా
సమాధానం
3. ఇండోనేషియా, ఇండియా, బ్రెజిల్

12. ఇటీవలే జీ20లో చేరిన ఆఫ్రికన్ యూనియన్ యందు ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ?

  1. 21 దేశాలు
  2. 35 దేశాలు
  3. 48 దేశాలు
  4. 55 దేశాలు
సమాధానం
4. 55 దేశాలు

13. ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ సంబంధించి సరైన వాక్యం గుర్తించండి ?

  1. ఢిల్లీలో G20 సమ్మిట్ థీమ్ : వన్ ఎర్త్, వన్ ఫామిలీ, వన్ ఫ్యూచర్
  2. ఇండియా G20 సమ్మిట్ లోగోలో ఏడు రెక్కల కమలం ఉంది
  3. భారత అధ్యక్షన అధికారిక G20 సమావేశాలు 28 నగరాల్లో నిర్వహించబడ్డాయి
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

14. ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏ మూడు ఖండలను కలుపుతుంది ?

  1. ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియా
  2. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా
  3. ఆసియా, ఆఫ్రికా, యూరోప్
  4. యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా
సమాధానం
3. ఆసియా, ఆఫ్రికా, యూరోప్

15. ఓపెన్ ఎరాలో అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విజేత ఎవరు ?

  1. మార్గరెట్ కోర్ట్
  2. నోవాక్ జకోవిచ్
  3. సెరెనా విలియమ్స్
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 & 2 సరైనవి

16. సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డులు కింది వారిలో ఎవరికి అందిస్తారు ?

  1. 75 ఏళ్లు దాటిన కళాకారులకు
  2. ఎలాంటి జాతీయ గౌరవం పొందని కళాకారులకు
  3. ఆప్షన్ 1 & 2 సరైనవి
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి కావు
సమాధానం
3. ఆప్షన్ 1 & 2 సరైనవి

17. ఇటీవలే మాస్టర్ కార్డ్ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. రజనీష్ కుమార్
  2. దినేష్ కుమార్ ఖరా
  3. డిపి సింగ్
  4. వినీత్ జోషి
సమాధానం
1. రజనీష్ కుమార్

18. 2023 టైమ్ వరల్డ్ బెస్ట్ 100 కంపెనీస్ లిస్టులో భారత్ నుండి చోటు దక్కించుకున్న ఏకైక సంస్థ ?

  1. రిలయన్స్ ఇండస్ట్రీస్
  2. ఇన్ఫోసిస్
  3. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
  4. హిందుస్థాన్ యూనిలీవర్
సమాధానం
2. ఇన్ఫోసిస్

19. స్వచ్ఛతా పఖ్వాడా ప్రచార కార్యక్రమంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది ?

  1. జల శక్తి మంత్రిత్వ శాఖ
  2. పర్యాటక మంత్రిత్వ శాఖ
  3. రైల్వే మంత్రిత్వ శాఖ
  4. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సమాధానం
3. రైల్వే మంత్రిత్వ శాఖ

20. ప్రాజెక్ట్ అభినందన్‌ను ప్రారంభించింన భారతీయ విమానయాన సంస్థ ఏది ?

  1. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్
  2. స్పైస్‌జెట్
  3. ఎయిర్ ఇండియా
  4. టాటా విస్తార ఎయిర్‌లైన్స్
సమాధానం
3. ఎయిర్ ఇండియా

21. విశ్వకర్మ యోజనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ?

  1. సంప్రాదయ కళాకారులకు 5% వడ్డీ రేటుతో 3లక్షల పూచీకత్తు రహిత రుణాలు అందిస్తుంది
  2. విశ్వకర్మ యోజన కనీస అర్హత 45 ఏళ్ళు
  3. ఆప్షన్ 1 సరైనది అయితే ఆప్షన్ 2 కూడా సరైనది
  4. ఆప్షన్ 2 మాత్రమే సరైనది
సమాధానం
1. సంప్రాదయ కళాకారులకు 5% వడ్డీ రేటుతో 3లక్షల పూచీకత్తు రహిత రుణాలు అందిస్తుంది

22. స్కిల్స్ ఆన్ వీల్స్ కిందిలో వాటిలో దేనికి సంబంధించింది ?

  1. ఆస్పిరేషనల్ జిల్లాలు & గ్రామాల్లో యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం
  2. మణిపూర్ యూత్ మొబైల్ నైపుణ్య శిక్షణా కార్యక్రమం
  3. వయోజనాలకు నైపుణ్య శిక్షణ
  4. యువ మహిళా పారిశ్రామిక వేత్తలకు నైపుణ్య శిక్షణ
సమాధానం
1. ఆస్పిరేషనల్ జిల్లాలు & గ్రామాల్లో యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం

23. ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన శాంతినికేతన్ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. ఉత్తర ప్రదేశ్
  2. పశ్చిమ బెంగాల్
  3. బీహార్
  4. గుజరాత్
సమాధానం
2. పశ్చిమ బెంగాల్

24. క్రింది వాటిలో దేనికి సంవిధాన్ సదన్‌గా నామకరణం చేశారు ?

  1. భారత సుప్రీం కోర్టు
  2. భారత నూతన పార్లమెంట్ భవనం
  3. భారత పాత పార్లమెంట్ భవనం
  4. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం
సమాధానం
3.భారత పాత పార్లమెంట్ భవనం

25. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ?

  1. ఈ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం పేరుతొ ప్రవేశపెట్టబడింది.
  2. ఈ బిల్లు చట్ట సభల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది.
  3. ఆప్షన్ 2 మాత్రమే సరైనది
  4. ఆప్షన్ 1 & 2 సరైనవి
సమాధానం
1. ఈ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం పేరుతొ ప్రవేశపెట్టబడింది

26. స్టాచ్యూ ఆఫ్ వన్‌నెస్ అనేది ఏ వ్యక్తికీ సంబంధించినది ?

  1. ఆచార్య నాగార్జున
  2. డా. బీఆర్ అంబేద్కర్
  3. ఆది శంకరాచార్యలు
  4. వల్లభాయ్ పటేల్
సమాధానం
3. ఆది శంకరాచార్యలు

27. ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బాకలారియేట్ సిలబస్ ప్రవేశపెట్టిన రాష్ట్రం ?

  1. తమిళనాడు
  2. పంజాబ్
  3. రాజస్థాన్
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
4. ఆంధ్రప్రదేశ్ 

28. ఇటీవలే అబ్దుల్ కలాం పేరుతొ నామకరణం చేయబడ్డ టార్డిగ్రేడ్ జీవి ఏది ?

  1. కలాం టార్డిగ్రేడ్
  2. టార్డిగ్రేడ్ కలాం
  3. కాలమి బాటిలిప్స్
  4. బాటిలిప్స్ కలామి
సమాధానం
4. బాటిలిప్స్ కలామి

29. ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలోని సభ్య దేశాలు ఏవి ?

  1. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, యూకే, యూఎస్
  2. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఇండియా, యూఎస్
  3. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్
  4. జపాన్, కెనడా, చైనా, యూకే, యూఎస్
సమాధానం
3. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్  

30. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారత్ ర్యాంక్‌ ?

  1. 40వ ర్యాంకు
  2. 55వ ర్యాంకు
  3. 35వ ర్యాంకు
  4. 44వ ర్యాంకు
సమాధానం
1. 40వ ర్యాంకు

One Comment

Post Comment