యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ | ఎగ్జామ్ షెడ్యూల్ & రిజల్ట్స్
Universities

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ | ఎగ్జామ్ షెడ్యూల్ & రిజల్ట్స్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1974 యూనివర్సిటీ చట్టం ద్వారా స్థాపించబడింది. దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలలో ఒకానొక గొప్ప ప్రీమియర్ యూనివర్సిటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పేరుంది. దాదాపు 2300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ యూనివర్సిటీ విభిన్న జంతు, వృక్ష జాతులతో జీవవైవిధ్యానికి నెలవుగా ఉంది. 734 రకాలకు పైగా పూలమొక్కలు, 10 జాతులకు సంబంధించిన క్షిరదాలు, 15 జాతుల సరీసృపాలు 220 పైగా పక్షు జాతులు ఇక్కడ జీవిస్తున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విభిన్న విభాగాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటుగా పరిశోధనాత్మక కోర్సులకు కేంద్రంగా ఉంది. ఈ యూనివర్సిటీ పరిధిలో దాదాపు ఐదువేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచింగ్ సిబ్బంది లెక్కన దాదాపు 400 మంది టీచింగ్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ NIRF ర్యాంకింగులో 15 స్థానంలో నిలిచింది. ఇండియా టుడే ర్యాంకింగ్ ప్రకారం దేశంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలలో 2వ స్థానం దక్కించుకుంది. QS ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగులో 600 నుండి 650 మధ్య ర్యాంకు సాధించింది.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రధానంగా రెసిడెన్సియల్ పీజీ పరిశోధన విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. పీజీ కోర్సులలో అడ్మిషన్ల కోసం ప్రతి సంవత్సరం మే-జూన్ నెలలలో ప్రత్యక ప్రవేశ పరీక్షా నిర్వహిస్తుంది. అలానే ఇంటిగ్రేటెడ్ M.Sc, MA, MSc, MFA, M.Tech, MBA, MCA, M.Phil మరియు Ph.D డిగ్రీలను కూడా అందిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం తీవ్ర పోటీ ఉంటుంది. కానీ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం విశ్వవిద్యాలయం సానుకూల-వివక్ష రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తుంది.

వెబ్‌సైట్‌ : www.uohyd.ac.in
రిజిస్ట్రార్
మెయిల్:  acadinfo@uohyd.ernet.in
ఫోన్: 23132102, 23132103 (O)
అడ్మిషన్లు
ఫోన్ +914023130000
ఎగ్జామినేషన్ సమాచారం
మెయిల్ : ce@uohyd.ernet.in
ఫోన్ (040) 23010248, 23132101
దూరవిద్య
మెయిల్: directorcde@uohyd.ernet.in, (040)24600264 24600265

Post Comment