రెండు లక్షల లోపు ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) విద్యార్థులకు కేంద్రప్రభుత్వం మైనారిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అందిస్తుంది. దీనిలో భాగంగా అడ్మిషన్, ట్యూషన్ ఫీజుతో సహా మైంటెనెన్సు అలోవెన్సు అందిస్తుంది.
మైనారిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు, పేదరికంతో కాలేజీ విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద 2006 నుండి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ (10+2), డిప్లొమా మరియు ఒకేషనల్ కోర్సుల (10+2) నుండి డిగ్రీ, పీజీ, పీహెచ్డీ మరియు ఎంఫిల్ వంటి కోర్సులకు కూడా వర్తింపజేస్తారు.
స్కాలర్షిప్ పేరు | పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ మైనారిటీస్ |
ఎవరు అర్హులు | మైనారిటీ విద్యార్థులు |
దరఖాస్తు ముగింపు తేదీ | 31-10-2022 |
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ | 15-11-2022 |
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ | 30-11-2022 |
ఈ పథకం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలు మరియు గుర్తింపు కలిగిన ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలలో చదివే మైనారిటీ విద్యార్థులకు వర్తింపజేస్తారు. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా ఏటా దాదాపు 5 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. విద్యార్థి అకాడమిక్ పరీక్షలలో కనీసం 50 శాతం మార్కులు సాధించి, కుటుంబ ఆదాయం రెండు లక్ష రూపాయల లోపు ఉంటె ఈ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం పరిధిలో 30% స్కాలర్షిప్'లు బాలికలు కేటాయిస్తారు. దరఖాస్తుల సంఖ్యా 5 లక్షలు మించితే, విద్యార్థి అకాడమిక్ మెరిట్ మరియు వయస్సు ఆధారంగా దరఖాస్తులు ఆమోదిస్తారు. ఎక్కువ వయస్సు ఉండే విద్యార్థులకు మొదట ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకం పరిధిలో ఎంపికైన విద్యార్థులకు, విద్యా సంవత్సరంలో గరిష్టంగా పది నెలలు అడ్మిషన్, ట్యూషన్ ఫీజుతో సహా, నెలవారీ మెంటెనెన్సు చార్జీలను అందిస్తారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేమెంట్ వివరాలు
స్కాలర్షిప్ పేరు | స్కాలర్షిప్ వివరాలు |
అడ్మిషన్ & ట్యూషన్ ఫీజు | క్లాస్ XI & XII -7,000/- ఏడాదికి |
ఒకేషనల్ కోర్సులు -10,000/- ఏడాదికి | |
యూజీ & పీజీ కోర్సులు - 3,000/ (సబ్జెక్టుకు)- ఏడాదికి | |
మైంటెనెన్సు అలోవెన్సు | క్లాస్ XI & XII - 380/- (హాస్టల్), 230/- (డే స్కాలర్) |
ఒకేషనల్ విద్యార్థులు - 570/- (హాస్టల్), 300/- (డే స్కాలర్) | |
యూజీ & పీజీ - 1,200/- (హాస్టల్), 550/- (డే స్కాలర్) |
స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ
జాతీయ కమిషన్ సెక్షన్ 2 (సి) మైనారిటీల చట్టం, 1992 ప్రకారం గుర్తించబడిన ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) కుటుంబాలకు చెందిన ఇంటర్ నుండి పీజీ, పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులు. విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రెండు లక్ష రూపాయలు మించకూడదు. విద్యార్థి, ముందు తరగతి అకాడమిక్ పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఈ స్కాలర్షిప్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు వరకు మాత్రమే అందిస్తారు. విద్యార్థి చెల్లుబాటు అయ్యే కుల మరియు ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు కలిగివుండాలి. విద్యార్థి తన ఆధార్ నెంబరుతో లింక్ చేయించుకున్న బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు చేయండి
ఈ స్కాలర్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ ఆయా రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు స్థానిక పత్రికల్లో లేదా న్యూస్ ఛానెల్స్ ద్వారా విడుదల చేస్తాయి.అర్హుత ఉండే విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో, ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థులు అందించిన వివరాలు అన్ని సక్రమంగా ఉండి, సదరు విద్యార్థి అర్హులు అని భావిస్తే, వారి బ్యాంకు అకౌంటులో స్కాలర్షిప్ జమచేస్తారు. ఇది వరకే అర్హుత పొందిన విద్యార్థులు తిరిగి కొత్త అకాడమిక్ ఏడాది కోసం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.