Advertisement
నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ : ప్రొఫిషినల్ సాఫ్ట్‌వేర్ కోర్సులు
Online Education Useful websites

నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ : ప్రొఫిషినల్ సాఫ్ట్‌వేర్ కోర్సులు

నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికను 2018 లో ప్రారంభించారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న  ప్రొఫిషినల్స్'ని రీ-స్కిల్ చేయడంతో పాటుగా భవిష్యత్ అవసరాలకు సరిపడే ఐటీ నిపుణులను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసారు.

సాంకేతిక రంగంపై మక్కువ ఉన్న విద్యారులకు, ఐటీ నిపుణులకు భవిష్యత్ కాలంలో వచ్చే అన్ని రకాల సాంకేతిక మార్పులను అధిగమించే నైపుణ్యాన్ని ఇది అందిస్తుంది. ఫ్యూచర్ స్కిల్స్ వేదికపై ప్రస్తుతం 150 పైగా ఐటీ ఫౌండేషన్ కోర్సులతో పాటుగా, 70+ జాబ్ ఓరియంటెడ్ కోర్సులను అందిస్తుంది.

వీటితో పాటుగా సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మొబైల్ టెక్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, వర్చువల్ రియాలిటీ & 3 డి ప్రింటింగ్ వంటి 10 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై పూర్తిస్థాయి కోర్సులను ఆఫర్ చేస్తుంది.

నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులు అన్ని దాదాపు ఐటీ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడ్డాయి. ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులన్నీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) చే ఫ్రొఫిషినల్ సర్టిఫైడ్ చేయబడి ఉంటాయి. వీటికి ఐటీ కంపెనీలు ప్రాధన్యత కల్పిస్తాయి.

ప్రోఫిసినల్ జీవితం ప్రారంభించే విద్యార్థులకు ఈ వేదిక ద్వారా సాధించిన కోర్సు క్రెడిట్స్ కెరీర్ పరంగా త్వరగా ఉద్యోగం సాధించేందుకు ఉపకరిస్తాయి. ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులు ఉచితంగా మరియు ప్రీమియం వర్సన్ లో అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్ స్కిల్స్ కంటెంట్ పార్టనర్స్ గా మైక్రోసాఫ్ట్, సిస్కో, స్కిల్ అప్, డిజిటల్ విద్య, సింపుల్ లెర్న్ వంటి ప్రముఖ ఇండస్ట్రీ టాప్ ఐటీ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

NASSCOM FutureSkills